పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్, నేసన్ దర్శకులతో పనిచేయడానికి మూడు సినిమాలకు సైన్ చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. అయితే ఎన్నికల హడావుడి మొదలైపోయింది. కాంగ్రెస్, టీడీపీ, వైఆర్సీపీ లు పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడిపోయాయి. పవన్ తాను స్థాపించిన జనసేన పార్టీ ఇంకా బుడిబుడి అడుగులు వేసే స్థితిలో ఉంది. పెద్ద పార్టీలతో పోటీపడాలంటే ఇప్పుడున్న బలం సరిపోదు. జనం మద్దతు కోసం వారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రజల్లోకి వెళ్లాలా? సినిమాలు చేయాలా? అని పవన్ ఆలోచనలో ఉన్నారు.
ఈ సంగతి తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి మంచి సలహా ఇచ్చారు. “రాజకీయ నేతగా సేవ చేయడంలో తప్పులేదు.. అందుకోసం సినిమాలను వదలకు” అని చెప్పారు. చిరు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సినిమాలను వదిలేశారు. అతను కష్టపడినా సీఎం కాలేక పోయారు. తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ అనుభవంతో నటనను వదలవద్దని తమ్ముడికి సూచించారు. అన్నని అన్నింటిలోనూ ఆదర్శంగా తీసుకునే పవన్ .. ఈ సలహా పాటిస్తారో, లేదో .. కొన్ని రోజుల్లోనే తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.