టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రియేటివ్ డైరెక్టర్లలో ఒకరైన (Sukumar) సుకుమార్ ఎంచుకునే కథలు ఇతర దర్శకుల కథలను భిన్నంగా ఉంటాయి. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కి ఫ్లాప్ అయిన సినిమాలను సైతం అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ (Ram Charan) సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన (Rangasthalam) రంగస్థలం ఏ రేంజ్ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. రంగస్థలం సినిమా నిడివి చాలా ఎక్కువని రంగస్థలం సినిమాలోని ముఖ్యమైన సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేస్తే సినిమా రిజల్ట్ మారిపోతుందేమో అని టెన్షన్ పడ్డానని సుకుమార్ కామెంట్లు చేశారు.
1 నేనొక్కడినే (1 Nenokkadine) సినిమా ఫ్లాప్ కావడానికి కొన్ని సీన్స్ ను తొలగించడమే కారణమని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో చిరంజీవి నుంచి సపోర్ట్ లభించిందని సుకుమార్ వెల్లడించారు. లెంగ్త్ ఎక్కువైనా ఎడిటింగ్ చేయకుండా అలాగే రిలీజ్ చేయండి అని చిరంజీవి (Chiranjeevi) భరోసా ఇవ్వడంతో సుకుమార్ సైతం టెన్షన్ పడకుండా సినిమాను రిలీజ్ చేయడం జరిగిందట. రంగస్థలం సమ్మర్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కావడం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకోవడం జరిగిందట. ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో చరణ్ పోషించిన పాత్రకు సైతం ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. రిస్కీ రోల్స్ లో నటిస్తూ చరణ్ అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు. చరణ్ వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా (S.S.Thaman) థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమాకు థమన్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో చూడాలి.