సౌత్ ఇండియాలోనే అత్యధిక టాప్ హీరోలు ఉన్న పరిశ్రమగా టాలీవుడ్ అవతరించింది. మనకు వంద కోట్ల వసూళ్లు అంటే అవలీలగా సాధించే హీరోలు అరడజనుకు పైగా ఉన్నారు. చిరంజీవి, పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ రేంజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశంలోనే భారీ చిత్రాల హీరోగా మారిపోయాడు. ప్రభాస్ మూవీ అంటే మినిమమ్ 300కోట్ల బడ్జెట్ పై మాటే అన్నట్లు పరిస్థితి ఉంది.
కాగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్రకటించడం జరిగింది. అందరూ స్టార్ డైరెక్ట్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఈ విషయంలో హీరో రామ్ చరణ్ వెనుకబడ్డారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన చేయనున్న మూవీపై క్లారిటీ లేదు. కెరీర్, స్టార్డమ్ ఒక మెట్టు పెరిగేలా మిగతా హీరోల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చరణ్ మాత్రం ఈ విషయంలో ఎందుకు యాక్టీవ్ గా లేరో అర్థం కావడం లేదు.
దశాబ్దాల అనుభవం ఉన్న చిరంజీవి చరణ్ కెరీర్ ని పట్టించుకోవడం లేదా అనే డౌట్ కొడుతుంది. చిరంజీవి తన సినిమాల హడావుడిలో పడి గతంలో వలె చరణ్ కి క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడం మానేశారా అనిపిస్తుంది. ఒకవేళ చరణ్ కి ఆ మెచ్యూరిటీ వచ్చింది, తాను ఇన్వాల్వ్ కాకూడదు అనుకుంటున్నారేమో.