Chiranjeevi: ఆ విషయంలో చిరంజీవికి ఎవరూ సాటిరారుగా.. మంచి హీరో అంటూ?

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై 13 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. భోళా శంకర్ ట్రైలర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ నుంచి సైతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ కు అవసరమైన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. మెహర్ రమేష్ కోరుకున్న సక్సెస్ ను ఈ సినిమా అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే మెహర్ రమేష్ గత సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. అందువల్ల భోళా శంకర్ నిర్మాతను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక చిరంజీవి ఈ సినిమా కోసం రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం అందుతోంది. ఈ విషయంలో చిరంజీవికి సాటిరారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి లాభాల్లో వాటా తీసుకోనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మంచి హీరో అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి భోళా శంకర్ తో వాల్తేరు వీరయ్య సినిమాను మించి సక్సెస్ సాధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ సినిమాకు తమన్నా, కీర్తి సురేష్ నటన హైలెట్ గా నిలవనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

ఈ సినిమాలో ప్రేక్షకులు వింటేజ్ మెగాస్టార్ ను చూడనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెహర్ రమేష్ సైతం ఈ సినిమాకు పరిమితంగా పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. భోళా శంకర్ ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుండగా ఆగష్టు నెలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ కమర్షియల్ లెక్కల విషయంలో సరికొత్త సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus