నిన్న ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేడుకలో తమన్ (S.S.Thaman) ఇచ్చిన స్పీచ్ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ‘ఈ రోజుల్లో ఓ సక్సెస్ కొట్టడం చాలా కష్టమైపోయింది. ఆ సక్సెస్ ను నిర్మాతల చేతిలో పెట్టడం ఇంకా కష్టంగా మారింది. పక్క దేశాల ప్రజలు మన తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా దేశవిదేశాల్లో రిలీజ్ అయ్యి అక్కడి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తమిళ, హిందీ, మలయాళం డైరెక్టర్లు, నిర్మాతలు తెలుగులో సినిమాలు చేయాలని చూస్తున్నారు. కానీ మనం మాత్రం ట్రోలింగ్, నెగిటివ్ ట్రెండ్స్ తో మన తెలుగు సినిమాని మనమే చంపేసుకుంటున్నాం.
Chiranjeevi
అంటే ఏం బతుకు బతుకుతున్నామో.. మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో నాకు ఛాన్సులు వస్తాయో లేదో అని భయం వేస్తుంది’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు తమన్. చాలా మంది తమన్ ఇలా ఎమోషనల్ గా మాట్లాడింది ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా కోసమే అని అంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘తమిళ సినిమాల్లో నుండి, యేసు ప్రభువు పాటల నుండి లేపేశాడు’ అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. అలాగే ఆ సినిమాని మొదటి షో నుండే కొంతమంది ట్రోలర్స్ సోషల్ మీడియాలో ఏకి పారేశారు.
గంటల వ్యవధిలోనే ఆ సినిమా హెచ్.డి ప్రింట్ బయటకి తెచ్చేసి లింక్స్ షేర్ చేశారు. ఫలితంగా ఆ సినిమా భారీ నష్టాలు మిగల్చడం ఖాయం అయిపోయింది. అందుకే తమన్ ఇలా రియాక్ట్ అయ్యాడు అని అంతా అనుకుంటున్నారు. ఇక తమన్ ఎమోషనల్ కామెంట్స్ కి తాజాగా చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. “డియర్ తమన్..నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు (Chiranjeevi) ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.
విషయం సినిమా అయినా క్రికెట్ అయినా…మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, ‘వర్డ్స్ కెన్ ఇన్స్పైర్. వర్డ్స్ కెన్ డిస్ట్రోయ్.చూజ్ వాట్ యు విష్ టు డు. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది.” అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. చిరు ఇలా రియాక్ట్ అవ్వడంతో తమన్ ఎమోషనల్ కామెంట్స్ అన్నీ ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ గురించే అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Dear @MusicThaman
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.