మొన్నామధ్య “మ్యాడ్” (MAD) సినిమాలో, ఒక డైలాగ్ లో వడ్డే నవీన్ (Vadde Naveen) పేరు వినిపించగానే ఆయనో హీరో ఉన్నాడు కదా అని చాలామంది న్యూ జనరేషన్ ఆడియన్స్ కి తెలిసింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో ఆయన పేరు వినిపించింది. మరి ఆ ట్రెండ్ ను గ్రహించాడో ఏమో కానీ.. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “నిలవకు ఎన్మేల్ ఎన్నాడి కోబం” అనే సినిమాకి తెలుగులో “జాబిలమ్మ నీకు అంత కోపమా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు.
Vadde Naveen
ఫిబ్రవరి 21న విడుదలవుతున్న ఈ చిత్రంలో అనిఖ సురేంద్రన్ (Anikha Surendran), ప్రియ ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier), పవిష్, మేథ్యు థామస్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సరిగ్గా ఫిబ్రవరి 21న సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ నక్కిన (Trinadha Rao) తెరకెక్కించిన “మజాకా” కూడా విడుదలకానుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో “గోల్డెన్ స్పారో” సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జీవి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ అన్ని చోట్ల వినబడుతున్నాయి. “రాయన్” (Raayan) తర్వాత ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనంతరం ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న “ఇడ్లీ కడాయ్” కూడా విడుదలకానుంది. నిత్యామీనన్ (Nithya Menen)కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంది.
మరోపక్క ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కిస్తున్న “కుబేరా” (Kubera) కూడా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధంగా ఉంది. చూస్తుంటే.. 2025లో ధనుష్ నటించిన, దర్శకత్వం వహించిన సినిమాలు దాదాపుగా 5 వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.