Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ సెట్స్ పై చిరు!

ఇటీవల కరోనా సోకి ఐసోలేషన్ లోకి వెళ్లిన చిరంజీవి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తిరిగి తన సినిమాలను మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. తను పూర్తిగా కోలుకున్నట్లు చెప్పిన ఆయన ఆన్ లొకేషన్ స్టిల్స్ ను కూడా షేర్ చేశారు. ‘టెస్ట్ లు చేయించగా నెగెటివ్ వచ్చింది. మళ్లీ పనిలో పడ్డాను.. యాక్షన్ మొదలైంది. నేను కోలుకోవాలని ప్రార్ధించిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు.

Click Here To Watch

దీంతో పాటు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ సెట్ లో కొన్ని స్టిల్స్ ను కూడా షేర్ చేశారాయన. ఊహించని విధంగా కరోనా బారిన పడ్డారు చిరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని గత నెల 26న ఆయన ప్రకటించారు. ఆ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లారు. చిరంజీవి ఐసోలేషన్ లో ఉన్నప్పుడే అతడి తల్లి పుట్టినరోజు రావడంతో.. ఆమెకి నేరుగా శుభాకాంక్షలు చెప్పి.. బ్లెస్సింగ్స్ తీసుకోలేకపోతున్నానంటూ తన బాధను వ్యక్తం చేశారు చిరంజీవి.

అలా పది రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్న చిరుకి ఇప్పుడు కరోనా నెగెటివ్ రావడంతో బయటకొచ్చారు. నేరుగా ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఆయన కోలుకొని మళ్లీ యాక్షన్ మోడ్ లోకి దిగడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే చిరు నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు.

1

2

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus