Chiranjeevi, Rajamouli: నాకు అలాంటి ఇమేజ్ అవసరం లేదు.. చిరు కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రాజమౌళికి దక్కిందని చెప్పాలి. ఇలా అద్భుతమైన దర్శకుడితో పని చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటారు.అయితే తనకు మాత్రం రాజమౌళితో నటించే అవకాశం వచ్చినా కూడా తాను నటించనని మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి రాజమౌళి ప్రస్తావన తీసుకోవచ్చారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. చిరంజీవి మాత్రం రాజమౌళి దర్శకత్వంలో తాను నటించని కుండలు.బద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం తానున్న పరిస్థితులలో తనకు పాన్ ఇండియా ఇమేజ్ ఏమాత్రం అవసరం లేదని మెగాస్టార్ వెల్లడించారు.

ఇక రాజమౌళి సినిమా అంటే సుమారు మూడు నాలుగు సంవత్సరాలు వేచి చూడాలి ఈ మూడు నాలుగు సంవత్సరాలలో తాను నాలుగైదు సినిమాలు చేసుకుంటానని చిరంజీవి తెలిపారు. అదేవిధంగా రాజమౌళి తన సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరకెక్కిస్తారు అలా ఆయనకు అనుగుణంగా నేను నటిస్తాను లేదో అన్న భావన కూడా నాలో ఉందంటూ చిరు వెల్లడించారు.

ఇలా రాజమౌళికి అనుగుణంగా నటిస్తానని నమ్మకం నాకు లేదని అందుకే తాను రాజమౌళి సినిమాలు చేయదలుచుకోలేదంటూ చిరంజీవి వెల్లడించారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ రెండు సినిమాలు చేశారు ఆ సంతోషం చాలు నాకు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus