అయితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వంటి వారు ఈ మీటింగ్ కి హాజరుకాలేదు. ఇందుకు గల కారణాలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బాలకృష్ణ.. ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే సినీ పరిశ్రమ కష్టసుఖాల్లో ఉండేది మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇండస్ట్రీకి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తుంది ఆయనే..!
కరోనా టైంలో పేద కళాకారుల్ని ఆదుకోవడంలో కానీ, సెకండ్ వేవ్లో కరోనా భారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చాలామంది పెదకళాకారుల్ని రక్షించడంలో కానీ, టికెట్ రేట్లు పెంపు విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి.. బ్రతిమాలడంలో కానీ.. ఇలా చాలా విషయాల్లో చిరు ఇండస్ట్రీకి అండగా నిలబడ్డారు. దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నది చిరునే.
మరి ఇలాంటి కీలక సమయంలో చిరు కనిపించకపోవడం ఏంటి? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అందుతున్న సమాచారం ప్రకారం.. చిరు ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కీలక షెడ్యూల్లో పాల్గొంటున్నారట. అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ టైంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చిరు అక్కడికి వెళ్లడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 26 కి ఆ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉందట. లేటయితే మళ్ళీ వీఎఫ్ఎక్స్ కి ఇబ్బంది వస్తుందని భావించి.. రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి చిరు (Chiranjeevi) షూటింగ్ కి వెళ్లడం జరిగింది అని తెలుస్తుంది.