Chiranjeevi, Srija: వైరల్ అవుతున్న మెగా డాటర్ శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్..!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కొణిదెల శ్రీజ అందరికీ సుపరిచితమే.ఈమె గతం గురించి కూడా అందరికీ తెలుసు. శ్రీజ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.తన పిల్లల లేటెస్ట్ ఫొటోలతో పాటు… తనకు సంబంధించిన విషయాలు, అభిప్రాయాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. శ్రీజ ఈ మధ్యనే ఫారెన్‌ కు వెకేషన్‌ కు వెళ్ళొచ్చింది. తన సోదరుడు చరణ్, అలాగే తన సోదరి సుస్మిత లతో కలిసి ఆమె ఫారెన్ ట్రిప్ వేసొచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఫారెన్ ట్రిప్ వేసింది. విదేశాల్లో ఆమె అందమైన ప్రాంతాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. శ్రీజ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వరల్డ్‌ గ్రాటిట్యూడ్‌ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శ్రీజ స్పందిస్తూ ‘‘సమయం మంచిదైనా, చెడ్డదైనా నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను కోపంగా ఉన్నప్పుడు నా కోపాన్ని భరించారు.

ఏడుస్తున్నపుడు ఓదార్చారు. నేను మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించారు.ఇప్పటికీ ఎప్పటికీ నాతో ఉంటున్నందుకు థాంక్స్. నా మాట వింటున్నందుకు, నా యోగ క్షేమాలు ఆరా తీస్తున్నందుకు, మీ కొండంత మద్దతుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కుటుంబానికి, ఫ్రెండ్స్‌ లాంటి ఫ్యామిలీకి ఎంతో రుణపడి ఉంటాను’’ అంటూ రాసుకొచ్చింది. శ్రీజ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus