మెగాస్టార్ చిరంజీవి వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు కూడా మంచి లాభాలను అందించాయి. అయితే ప్రస్తుతం డైరెక్టర్ వినాయక్ కెరీర్ ఆశాజనకంగా లేదు. గత కొన్నేళ్లలో ఖైదీ నంబర్ 150 మినహా వినాయక్ సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.
ప్రస్తుతం వినాయక్ తెలుగులో సక్సెస్ సాధించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటించారు. అయితే చిరంజీవితో ఒక సినిమా చేయాలని వినాయక్ ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది. పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేయాలని చిరంజీవి వినాయక్ కు సూచించారని కథ నచ్చితే ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం అసాధ్యం కాదని బోగట్టా. రీఎంట్రీలో చిరంజీవి కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దర్శకుల సక్సెస్ రేట్ కంటే కథకే మెగాస్టార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కథ నచ్చితే ఇతర భాషల రీమేక్ సినిమాల్లో కూడా నటించడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. చిరంజీవి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో కథ విషయంలో మెగాస్టార్ ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది.
చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. వయస్సు పెరుగుతున్నా చిరంజీవి డ్యాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. యువతలో చిరంజీవికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.