మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ వెండితెర పై తిరుగులేని స్టార్ గానే కొనసాగుతున్నారు. బ్లడ్ బ్యాంక్, ఎయె బ్యాంక్ వంటి సేవ సంస్థల్ని కూడా కొనసాగిస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు విద్యారంగం వైపుకు కూడా అడుగులు వేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీగా ఇక నుండీ మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించనుంది. చిరంజీవి పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యా సంస్థలు మొదలు కానున్నాయట. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ , అయన పెద్ద తమ్ముడు నాగబాబు ఆధ్వర్యంలో ఈ విద్యా సంస్థలు నడుస్తాయట.
ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాల్లో మొదటి స్కూల్ ప్రారంభం కానుందట. ఈ ఏడాది నర్సరీ నుండీ 5వ తరగతి వరకూ అడ్మిషన్స్ తీసుకుంటారట. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో మెరుగైన విద్యను అందించి పిల్లలకు మంది భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా యాజమాన్యం ముందుకు సాగుతుంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే .. మెగా అభిమానుల పిల్లలకి ఈ సంస్థల్లో ప్రత్యేకమైన రాయితీలు కూడా ఉంటాయట. త్వరలోనే మరిన్ని బ్రాంచ్ లను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మెగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.