Chiranjeevi, Mahesh Babu: మహేష్ గొప్పతనాన్ని చెబుతూ బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజుతో(ఆగస్టు 9తో) 47 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ‘పోకిరి’ ‘ఒక్కడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలు స్పెషల్ షో లు వేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ అవి యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్లో అందుబాటులో ఉన్న సినిమాలే అయినప్పటికీ ఓ రిలీజ్ సినిమాకి జరిగినట్లు ఆ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం కూడా అందరం చూశాం.

ఇలా వచ్చిన కలెక్షన్లు మొత్తం చారిటీకి ఇవ్వబోతున్నట్లు కూడా మహేష్ టీం తెలిపింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున మహేష్ బాబు బర్త్ డే ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ” ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు.ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻 Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 ” అంటూ ‘సైరా’ టైంలో మహేష్ తో దిగిన ఫోటోని జత చేసి పేర్కొన్నారు. మెగాస్టార్ వంటి ఎవర్గ్రీన్ స్టార్ హీరో మహేష్ గొప్పతనాన్ని చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో అభిమానులు పైసా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus