God Father: కేరళలో గాడ్ ఫాదర్ మలయాళ వెర్షన్ హిట్టవుతుందా?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తెలుగు భాషలలో ఈ సినిమా రిలీజ్ కానుందని ఇప్పటికే వెల్లడైంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే గాడ్ ఫాదర్ సినిమాను మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. లూసిఫర్ సినిమాను మలయాళంలో చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ సినిమాను కేరళలో ఆదరిస్తారా అని నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

మలయాళంలో రిలీజ్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ నటించడంతో హిందీలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. హిందీలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. గాడ్ ఫాదర్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవి ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అని చిరంజీవి భావిస్తుండటం గమనార్హం. చిరంజీవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గాడ్ ఫాదర్ రిలీజ్ కు పదిరోజుల సమయం మాత్రమే ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఆచార్య మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు ఈ సినిమా చెక్ పెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లైన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus