Indra: రీరిలీజ్ సినిమాతో అదరగొట్టిన మెగాస్టార్.. అక్కడ సైతం సత్తా చాటారుగా!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  బి.గోపాల్ (B. Gopal) కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంద్ర (Indra) మూవీ 22 ఏళ్ల క్రితం థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా తాజాగా థియేటర్లలో రీరిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రీరిలీజ్ లో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. రీరిలీజ్ సినిమాతో సైతం మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టారు. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమాతో సత్తా చాటారు.

Indra

ఓవర్సీస్ లో ఈ సినిమా 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. రీరిలీజ్ సినిమాలలో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదని తెలుస్తోంది. చిరంజీవి సినిమాలు రీరిలీజ్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో చిరంజీవి నటించిన మరిన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇంద్ర సినిమాను అభిమానులు థియేటర్లలో చూస్తున్న వీడియోలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని అభిమానులు ఈ విధంగా చాటుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంద్ర సినిమాకు ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు విశ్వంభర (Vishwambhara)  మూవీ నుంచి తాజాగా రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను మెప్పించింది.

విశ్వంభర మూవీ బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల రూపాయలు కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమాలో త్రిష (Trisha)  హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. స్టాలిన్ (Stalin) తర్వాత చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం.

జర్నలిస్ట్ పై ఓ రేంజ్లో రెచ్చిపోయిన యాంకర్ రోహిణి.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus