మెగా ఫ్యామిలీలో ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలుండగా.. ఇప్పుడు తాజాగా ఆ కుటుంబం నుంచి మరో యువకుడు కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. అతడే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్. శ్రీజను రెండో వివాహం చేసుకొన్న కళ్యాణ్ కు ముందు నుంచీ సినిమాలంటే విశేషమైన ఆసక్తి ఉండేది. అయితే.. మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చాక ఆ ఆసక్తి కాస్త కోరికగా మారింది. అల్లుడి అభీష్టాన్ని అర్ధం చేసుకొన్న చిరంజీవి కూడా సరేననడంతో యాక్టింగ్, డ్యాన్స్ వంటి అన్నీ విషయాల్లోనూ ట్రైనింగ్ తీసుకొని త్వరలో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వనున్నాడు కళ్యాణ్. కౌశిక్ అనే కొత్త డైరెక్టర్ తో సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ కు వెళ్లనుంది.
అయితే.. ఎనౌన్స్ మెంట్ తర్వాత అందరికీ వచ్చిన ఒకే ఒక్క డౌట్ ఏంటంటే.. చిరంజీవి తలచుకొంటే తన అల్లుడిని కాస్త పేరున్న డైరెక్టర్ లేదా మాంచి మాస్ డైరెక్టర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయించగలడు కదా, అలాంటిది ఒక కొత్త దర్శకుడిని నమ్మి అంత ఈజీగా ఎలా ప్రొజెక్ట్ మొదలెట్టించేశాడా అనే. అయితే.. ఈ ఇంట్రడక్షన్ వెనుక బోలెడు కథ ఉంది. మెగా ఫ్యామిలీలోని అందరి హీరోల్లానే కళ్యాణ్ కూడా వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గరే యాక్టీంగ్ కోర్స్ చేశాడు. అక్కడే కౌశిక్ పరిచయమయ్యాడు కళ్యాణ్ కి. కౌశిక్ ముందు కథను సత్యానంద్ కి చెప్పడం, సత్యానంద్ కి నచ్చి కళ్యాణ్ కి రిఫర్ చేయడం, ఆ కథను చిరంజీవి కూడా విని ఒకే చేసి, సాయి కొర్రపాటిని పిలిచి మరీ ప్రోజెక్ట్ అప్పగించడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. అదండీ సంగతి.. మెగా అల్లుడి ఎంట్రీ వెనుక ఇంత పెద్ద కథ ఉంది. మరి మనోడు వెండితెరపై ఏమేరకు రాణిస్తాడు అనే విషయం సినిమా చూసాకే తెలుస్తుంది.