అభిమాన హీరో పుట్టిన రోజునాడు లేదా ఏదైనా స్పెషల్ డే వస్తే.. మనుషులు అంతా కలసి ఓ ఆకారంలో నిల్చుని డ్రోన్ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీయడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఆ వ్యక్తి పేరుగా గానీ, ముఖం ఆకారంలో కానీ.. నిల్చుని తమ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. తాజాగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఆకారంలో ఇలా విద్యార్థులు నిల్చుని ఓ వీడియోను రూపొందించారు. దీంతో ఆ వీడియోల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రక్రియలో సుమారు ఆరు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారట.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్, చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లుక్‌ను రీ క్రియేట్ చేసి చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటారు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం విద్యార్థులు. మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ లుక్ గీసి.. ఆ ఆకారంలో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు కూర్చున్నారు. ఈ మొత్తం ప్రక్రియను చిత్రీకరించారు. ఇటీవల మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా వెళ్లారు.
అక్కడ ఆయనను సర్‌ప్రైజ్ చేస్తూ వీరయ్య లుక్ వీడియోను ప్లే చేశారు. ఆ వీడియోను చూసిన చిరంజీవి తెగ మురిసిపోయారు. తనపై ప్రేమ కురిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆ వీడియోను దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోందని సమాచారం. సినిమాను ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం అహర్నిశలు శ్రమిస్తోందని టాక్. అయితే అప్పటికి పూర్తవుతుందా? లేదా? అనే ప్రశ్న అయితే చిత్రవర్గాల్లో ఉందని అంటున్నారు.
The crazy love for Megastar and #WaltairVeerayya has gone to another level @KChiruTweets‘s massy look from the movie recreated with formation by students ❤️
6వేల మంది విద్యార్థులు తమ అభిమానాన్ని ఓ కళాఖండంగా మలిచి కోట్లహృదయాలలో కొలువైన మెగాస్టార్ చిరంజీవి గారికి అందించిన అద్భుత దృశ్యకావ్యం⚡#WaltairVeerayya#Mega154