Chiyaan Vikram: మహేష్ రాజమౌళి కాంబో మూవీలో విక్రమ్.. క్లారిటీ ఇదేనంటూ?

మహేష్ (Mahesh Babu)  రాజమౌళి (S. S. Rajamouli)  కాంబో మూవీకి సంబంధించి ఏ చిన్న వార్త వైరల్ అయినా ఆ వార్త నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో విక్రమ్ (Chiyaan Vikram)  నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల గురించి విక్రమ్ వైపు నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చేసింది. తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా గురించి స్పందించడం కొసమెరుపు. రాజమౌళి చాలా మంచి వ్యక్తి అని మేము అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటామని విక్రమ్ తెలిపారు.

భవిష్యత్తులో రాజమౌళితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నానని అయితే ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదని విక్రమ్ వెల్లడించారు. ప్రస్తుతం సినిమాలకు భాషతో సంబంధం లేదని నాకూ తెలుగు వాళ్లతో వర్క్ చేయాలని ఉందని విక్రమ్ చెప్పుకొచ్చారు. తంగలాన్ (Thangalaan) మూవీ కంటెంట్ విషయంలో మేము కాన్ఫిడెన్స్ తో ఉన్నామని అన్ని సినిమాలకు థియేటర్లు దొరుకుతాయని అనుకుంటున్నానని విక్రమ్ కామెంట్స్ చేశారు.

అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నానని విక్రమ్ తెలిపారు. కోలీవుడ్ నిర్మాతల మండలికి సంబంధించి ఇటీవల వార్తలు రాగా ఆ వార్తల గురించి సైతం విక్రమ్ రియాక్ట్ అయ్యారు. తంగలాన్ రిలీజ్ తర్వాత తాను స్పందిస్తానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం చారిత్రాత్మక విజయం అని విక్రమ్ చెప్పుకొచ్చారు. పవన్ అద్భుతమైన వ్యక్తి అని ఆయన వర్క్ అంటే నాకెంతో ఇష్టం అని విక్రమ్ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం అయ్యారంటే చాలా సాధారణమైన విషయం అని వెల్లడించారు. గ్లామర్, డీ గ్లామర్ గురించి నేను పట్టించుకోనని విక్రమ్ చెప్పుకొచ్చారు. విక్రమ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తంగలాన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. భవిష్యత్తులో రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తాను కానీ ఆ సినిమా మహేష్ రాజమౌళి సినిమా అని చెప్పలేనని విక్రమ్ చెప్పకనే చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus