Citadel: ప్రియాంక చోప్రా పస లేదు.. మరి సమంత ఏం చేస్తుందో?

వందల కోట్లు పోసి సినిమా తీసి.. ఆ సినిమా తుస్‌ మంటే చాలా బాధేస్తుంది. అయితే ఇది హాలీవుడ్‌లో చూస్తే.. వందల కోట్లు బదులు వెయ్యి కోట్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడి బడ్జెట్‌ ఆ రేంజిలో ఉంటుంది మరి. అయితే వేల కోట్లు పోసి సినిమా తీసి పోతేనే అంద బాధ అనిపిస్తే.. వెబ్‌ సిరీస్‌ తీసి అది తేడా కొడితే.. ఆ బాధ వర్ణనాతీతం ఇప్పడు అలాంటి బాధను ‘సిటడెల్‌’ పడుతోంది అంటున్నారు. ఇంటర్నేషన్‌ వెర్షన్‌ ‘సిటడెల్‌’కు వచ్చిన రెస్పాన్సే దీనికి కారణం.

‘అవెంజర్స్’ సినిమా తీసిన రూసో బ్రదర్స్ కథను అందించడంతో ఈ సిరీస్‌కు మంచి క్రేజ్‌ వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్ కూడా బోలెడు ఆశలు పెట్టుకుంది. ప్రియాంక చోప్రా అందులో నటించడంతో ఆ కోణంలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంగ్లిష్‌తోపాటు భారతదేశంలోని ప్రముఖ భాషల్లో ఈ సిరీస్‌ను రిలీజ్‌ చేశారు. అయితే ఆ సిరీస్‌ స్ట్రీమింగ్‌కి అంత స్పందన రాలేదు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ‘సిటడెల్‌’ ఇంటర్నేషనల్‌ వెర్షన్‌కు సుమారు 250 మిలియన్ డాలర్ల ఖర్చు పెట్టారట. అంటే మన కరెన్సీలో 2 వేల కోట్లకుపై మాటే.

తీరా స్ట్రీమింగ్‌ అయ్యాక చూస్తే ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో తొలుత అంత ప్రచారం వేస్ట్‌ అయ్యింది అనుకుంటే.. ఆ తర్వాత భారీ బడ్జెట్‌ వేస్ట్‌ అయ్యింది అంటున్నారు. హాలీవుడ్‌ సిరీస్‌ వల్ల అమెజాన్ ప్రైమ్ సీరియస్‌గా కొన్ని మార్పులు చేస్తోందట. ఈ మేరకు ఆ సిరీస్‌ను ఫైనల్‌ చేసిన టీమ్‌ను పక్కన పెట్టారనే మాట కూడా వినిపిస్తోంది.

దీంతో ఇప్పుడు ఇండియన్ వెర్షన్‌పై చూపు పడింది అంటున్నారు. మన దగ్గర వరుణ్ ధావన్, సమంతతో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తలు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు సమంత ఉండటంతో సౌత్‌లో కూడా ఆదరణ ఉంటుంది అంటున్నారు. అయితే హాలీవుడ్‌ స్థాయిలో కనెక్ట్‌ కాని సిరీస్‌ మరి ఇండియన్‌ వెర్షన్‌లో కనెక్ట్‌ అవుతుందా అనేది చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus