చియాన్ విక్రమ్ హీరోగా ‘డిమోటీ కాలనీ’ ‘అంజలి సి.బి.ఐ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. ఇది అతనికి మూడో చిత్రం కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’ బ్యానర్ పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ ‘ఎన్వీఆర్ సినిమా’ ద్వారా విడుదల చేస్తున్నారు.
‘కె.జి.ఎఫ్'(సిరీస్) హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ వారం ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ‘కోబ్రా’.దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.
వాటి వివరాలను ఓ సారి గమనిస్తే :
నైజాం
1.65 cr
సీడెడ్
0.75 cr
ఉత్తరాంధ్ర
0.70 cr
ఈస్ట్
0.18 cr
వెస్ట్
0.15 cr
గుంటూరు
0.28 cr
కృష్ణా
0.36 cr
నెల్లూరు
0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.27 cr
కోబ్రా చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.పాజిటివ్ టాక్ రాబట్టుకుంటే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే అపరిచితుడు తర్వాత విక్రమ్ నటించిన ఏ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు.