ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన రామచంద్ర ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్నీటి కష్టాల గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. దాదాపు 100 సినిమాలలో నటించిన ఈ నటుడు నిన్ను చూడాలని నా తొలి సినిమా అని ఆ సినిమాకు నా పారితోషికం 11,000 రూపాయలు అని వెల్లడించారు. 2016 సంవత్సరంలో నా కాలు ఫ్రాక్చర్ అయిందని ఈ నటుడు కామెంట్లు చేశారు. ఆ ఫ్రాక్చర్ నుంచి కోలుకోవడానికి మూడు సంవత్సరాల సమయం పట్టిందని ఆయన అన్నారు.
ఆ తర్వాత కరోనా వల్ల మరో రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితం అయ్యానని రామచంద్ర పేర్కొన్నారు. ఈ విధంగా కెరీర్ కు సంబంధించి గ్యాప్ వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు. ఆనందం సినిమా సక్సెస్ సాధించడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయని రామచంద్ర వెల్లడించారు. పరుగు సినిమా అడిషన్స్ లో రిజెక్ట్ చేశారని ఖలేజాలో నేను డబ్బింగ్ చెప్పిన సీన్లు తీసేశారని ఆయన అన్నారు.
గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా, సర్కారు వారి పాట సినిమాలలో ఎడిటింగ్ లో నా సీన్లు పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. జబర్దస్త్ షోలో అవకాశం కోసం ప్రయత్నం చేశానని అయితే వాళ్లు నన్ను ఎంపిక చేయలేదని ఆయన అన్నారు. కొందరిని నమ్మి ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టానని ఆ డబ్బులు తిరిగి రాలేదని రామచంద్ర పేర్కొన్నారు. ఆ వ్యాపారంలో ఏకంగా 60 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
(Ramachandra) నా కాలు ఫ్రాక్చర్ కావడంతో భారీ మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విధంగా సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నానని ఆ తర్వాత మా అమ్మ చనిపోయిందని ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలిందని ఆయన చెప్పుకొచ్చారు. వాటి నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని రామచంద్ర తెలిపారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా