కొన్ని సినిమాల్లో కొంతమంది కమెడియన్స్ ని చూడగానే మనకి నవ్వు వచ్చేస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పనక్కర్లేదు, కేవలం ముఖం చూస్తేనే నవ్వేస్తాము. అలాంటి కమెడియన్స్ మన టాలీవుడ్ లో కుప్పలు తెప్పలు గా ఉన్నారు. కానీ మిగతా ఇండస్ట్రీస్ లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కానీ తమిళ సినిమా ఇండస్ట్రీ లో కొంత చెప్పుకోదగ్గ కమెడియన్స్ బాగానే ఉన్నారు. వారిలో ముఖం చూడగానే మనకి నవ్వొచ్చే కమెడియన్స్ చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు.
అంత తక్కువమంది ఉన్నారు, అలాంటి వారిలో ఒకరే యోగిబాబు. ఈయన లేని తమిళ సినిమాని అసలు ఊహించుకోలేం, ఆ రేంజ్ లో ఎదిగాడు ఈయన. 2009 వ సంవత్సరం లో ‘యోగి’ అనే సినిమా ద్వారా ఇతను వెండితెర కి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడం తో అప్పటి నుండి అందరూ ఆయనని యోగి బాబు అంటూ పిలిచేవాళ్ళు. ఈయన మన తెలుగులో ఇప్పటి వరకు సినిమా చెయ్యలేదు కానీ, ‘డాక్టర్’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం తో మాత్రం ఇక్కడి ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.
ఈ చిత్రం లో (Yogi Babu) యోగిబాబు కామెడీ టైమింగ్ ని ఎంజాయ్ చెయ్యని వారంటూ ఉండరు. ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన ‘లవ్ టుడే’ సినిమాతో కూడా ఆయన అందరికీ పరిచయం. ఈ సినిమాలో కూడా అతని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇలా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న యోగి బాబు ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఒక్క రోజు కాల్ షీటు దాదాపుగా 18 లక్షల రూపాయిల వరకు ఉంటుందట. అంటే ఎన్ని రోజులు ఆయన సెట్స్ లో ఉంటే అన్ని 18 లక్షల రూపాయిలు ఇవ్వాలి అన్నమాట. ఈ లెక్కన డాక్టర్ సినిమాలో మొత్తం ఉంటాడు,ఈ సినిమాకి అతని రెమ్యూనరేషన్ 10 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. అంత రెమ్యూనరేషన్ అక్కడ కొంత మంది కోలీవుడ్ హీరోలు కూడా తీసుకోవడం లేదట. మరి ఈ డిమాండ్ తో ఎన్ని ఏళ్ళు కొనసాగుతాడో చూడాలి.