కోవిడ్ తర్వాత ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంపత్ నంది (Sampath Nandi) కథ అందించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అది పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. ఓటీటీ ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ అందులో ఉంది. కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. కానీ ఓటీటీలో అలాంటి వాటికి కంప్లైంట్స్ అంటూ ఏమీ ఉండవు.
అవన్నీ ఎలా ఉన్నా.. ‘ఓదెల రైల్వే స్టేషన్’ కి మంచి వ్యూయర్షిప్ అయితే వచ్చింది. ఇలా ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.మరోపక్క ‘పొలిమేర 2’ ని థియేటర్లలో రిలీజ్ చేశారు. అది మంచి విజయం సాధించింది. బహుశా అందుకే అనుకుంట ‘ఓదెల 2′(Odela 2) థియేట్రికల్ సినిమాగా చేయాలి అనుకున్నారు సంపత్ నంది అండ్ టీం. అందుకోసం చాలా సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు.
ముందుగా తమన్నా (Tamannaah Bhatia) వంటి స్టార్ హీరోయిన్ ని ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్నారు. అలాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీయాలి దీనిని మలచాలి అనుకున్నారు. అంతేకాకుండా పరమ శివుని బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నారు. ఈ మధ్య సినిమాల్లో దైవత్వం ఉండి.. గ్రాఫిక్స్ లేదా ఏఐని వాడుకుని దేవుళ్లను చూపిస్తే.. జనాలకి పూనకాలు వచ్చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి ఇలాంటి ఎలిమెంట్స్ బాగా నచ్చేస్తున్నాయి. సో అలా చూసుకున్నా ‘ఓదెల 2’ కి (Odela 2) కలిసొచ్చే అవకాశాలే ఎక్కువ.
సరే మొత్తానికి ‘ఓదెల 2’ ఈరోజు థియేటర్లలోకి తెచ్చారు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్లకు కదిలి వచ్చారు. అది కూడా మంచి విషయమే. అయితే సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది. ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. కానీ ‘ఓదెల 2’ కి పరమశివుని బ్యాక్ డ్రాప్ తీసుకుని ఇందులో అడల్ట్ కంటెంట్ సీన్లు పెట్టడం అత్యంత బాధాకరం. సినిమా స్టార్టింగ్లోనే ఒక పెళ్లి జరుగుతుంది. తర్వాత ఫస్ట్ నైట్ సీన్ వస్తుంది.
శోభనం గదిలో పెళ్లి కూతురు తన వంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కనిపెట్టమని పెళ్లి కొడుక్కి ఓ క్విజ్ పెడుతుంది. అందుకు ఆమె బట్టలు తీసి మరీ లెక్కపెడతాడు ఆ పెళ్లి కొడుకు.కానీ అతను మాత్రం బట్టలు వేసుకునే ఉంటాడు. బహుశా దర్శకుడికి ఇతను బట్టలు తీస్తే ఇబ్బంది అని ఉంచేశాడేమో. కర్మ..! అటు తర్వాత కొంతసేపటి తర్వాత ఇంకో పెళ్లి జరుగుతుంది. ఆ జంట శోభనం ఓ పొలాల్లో ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు.
ఇక క్లైమాక్స్ లో శివశక్తి అయిన తమన్నా తనని తాను విలన్ కి సమర్పించుకుంటే ఊరిని వదిలేస్తాను అంటాడు. అందుకోసం ఆమె రెడీ అవుతుంది. అయితే ఊరందరి ముందు ఆమెను అనుభవించాలి అని విలన్ ఆమె పడుకున్న మంచాన్ని గుడి ముందుకు తీసుకొచ్చేస్తాడు. తర్వాత తమన్నా పై అతను పడటం.. అసలు గుడి ముందు ఇలాంటి సీన్లు పెట్టాలి అనే థాట్ ఎంత నీచంగా ఉందో మీ ఊహలకే వదిలేస్తున్నా.
సంపత్ నంది వంటి స్టార్ డైరెక్టర్ పనిచేసిన సినిమాలో ఇలాంటి సీన్లు ఎలా పెట్టాడో ఎంత జుట్టు పీక్కుని ఆలోచించినా అర్ధం కాదు. హిట్ సినిమా ఇచ్చాడా.. ప్లాప్ సినిమా ఇచ్చాడా? అనేది తర్వాత సంగతి. మంచి మార్కెట్, గౌరవం కలిగిన సంపత్ నంది అనే స్టార్ డైరెక్టర్ ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు కూడా ఇలాంటి సీన్లు ఎలా ఉంచాడో అర్థం కాదు.