సగటు కమర్షియల్ సినిమా అంటే జనాలకు నచ్చక ‘ఆచార్య’ను లైట్ తీసుకున్నారు అని విమర్శకులు, పరిశీలకులు గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లే సగటు కమర్షియల్ సినిమా అయిన ‘అఖండ’తో ‘ఆచార్య’ను పోలుస్తున్నారు. వాళ్లెవరో చెప్పారు అని కాదు కానీ, రెండు సినిమాలకు చాలా సారూపత్య ఉంటుంది. అయితే ఆ సారూప్యతల్లోనే చిన్నపాటి విషయాలు మిస్ అయ్యాయి. అందుకే ‘ఆచార్య’ దారుణంగా ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు. ఆ కామన్ పాయింట్స్, కొరటాల చేసిన ఎర్రర్స్ ఏంటో చూద్దాం!
‘అఖండ’ సినిమా మొత్తం ఎప్పుడూ హైలోనే ఉంటుంది. ఇద్దరు బాలకృష్ణలు కనిపించినప్పుడల్లా సినిమా జోష్ పీక్స్ అని చెప్పొచ్చు. అన్నింటికి మించి ‘అఖండ’లో బాలయ్యల ఎంట్రీలు అదిరిపోతాయి. అయితే ‘ఆచార్య’ విషయానికొచ్చేసరికి ఆ ఎంట్రీలు మిస్ అయ్యాయి అని చెప్పొచ్చు. అందుకే సినిమాలో ఇంట్రడక్షన్ జోష్ మిస్ అయ్యింది అని అంటున్నారు పరిశీలకులు.
విలన్ ఎంత బలంగా ఉంటే.. హీరో పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది అని చెబుతారు సినిమా నిపుణులు. ‘అఖండ’, ‘ఆచార్య’ మధ్య కామన్ పాయింట్, తేడాల్లో ఇది కూడా ఉంది. రెండు సినిమాల్లో మంచి విలన్లు అయితే ఉన్నారు. కానీ ఆ విలన్ల ఇంపాక్ట్ సినిమాలో తక్కువ. ‘అఖండ’లో శ్రీకాంత్ విలనిజం, ‘ఆచార్య’లో సోనూ సూద్ విలనిజం చూస్తే మనకు తేడా తెలిసిపోతుంది.
సినిమాలో హీరో ఎప్పుడూ పేదల పక్షపాతి, అభ్యాగ్యులను ఆదుకునేవాడులా ఉండాలి. అలా ఉండాలంటే సినిమాలో అలాంటి పరిస్థితులు ఉండాలి, ఒకవేళ ఉంటే వాటిని అంతే పక్కాగా చూపించాలి. మాటల్లో ఆ కష్టాలు చెప్పకూడదు. ‘అఖండ’లో చాలా సన్నివేశాల్లో ఆ కష్టం కనిపిస్తే, ‘ఆచార్య’లో ఆ కష్టం ప్రజల మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. ఇదే తేడా.
మాస్ సినిమా చూసి బయటకొచ్చే జనాలకు, సినిమా థియేటర్లలోకి వెళ్లే జనాలకు బాగా అలవాటయ్యేది డైలాగ్. సినిమా టీజర్‌లోని, సినిమాలోని డైలాగ్స్‌ను కంఠతా పెట్టేసుంటారు. అలాంటి గుర్తుంచుకునే డైలాగ్స్ ఏవీ ‘ఆచార్య’ సినిమాలో లేవు అనే చెప్పాలి. ‘పాఠం – గుణపాఠం’ డైలాగ్ తప్ప పెద్దగా వినిపించేవి లేవు. ఇక ‘అఖండ’ విషయానికొస్తే ‘బోత్ ఆర్ నాట్ సేమ్’.
థియేటర్‌లో ప్రతి పావు గంటలకు ఒకసారి ప్రేక్షకుడు ఈల వేయాలి అంటుంటారు. అప్పుడే సినిమాకు బంపర్ హిట్ పక్కా అని చెబుతారు. ‘అఖండ’లో అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఇద్దరు బాలయ్యలకు తెగ ఎలివేషన్లు రాశారు బోయపాటి శ్రీను. ఇక ‘ఆచార్య’లో అయితే ఇద్దరు స్టార్లు ఉన్నా సీన్లు లేవు అంతే. ‘సిద్ధ’ పాత్రకు ఒకటి రెండు ఉన్నాయి అని చెప్పొచ్చు.
మాస్ సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్. మధ్యలో మాస్ మేనరిజమ్స్. సూటిగా చెప్పాలంటే ‘ఆచార్య’లో ఇవి ఒకటి, రెండు దగ్గర్ల కనిపిస్తాయి. సిద్ధ పాత్ర చనిపోయే ముందు ఫైట్‌లో ఇలాంటి యాక్షన్ సీన్ చూడొచ్చు. మొత్తం సినిమాకు ఒక్కటి సరిపోదు కదా. ‘అఖండ’లో అయితే అరగంటకొక యాక్షన్ సీన్ పెట్టి అదరగొట్టేశారు.
‘అఖండ’ సినిమా విజయంలో నేపథ్య సంగీతం ప్రభావం ఎంత అనేది అందరికీ తెలిసిందే. తమన్ ఆర్‌ఆర్ లేకపోతే సినిమా తేలిపోయేదే అనే వాళ్లూ ఉన్నారు. బాలయ్య – బోయపాటి – తమన్ కలయిక కాబట్టే సినిమా ఆ రేంజ్‌లో ఉంది అని అన్నారు కూడా. ఇక ‘ఆచార్య’ విషయానికొస్తే అలాంటి నేపథ్య సంగీతం మిస్ అనే చెప్పాలి. ఇది చాలు కదా పరిస్థితి తెలుసుకోవడానికి.
‘అఖండ’లో ఇద్దరు బాలకృష్ణలు ఉన్నప్పటికీ.. అఘోరా పాత్ర ఎప్పడూ టాప్‌లో ఉంటుంది. ఆ పాత్ర తర్వాత సినిమాలో రెండో బాలయ్య పాత్ర. కానీ సిద్ధ పాత్ర కోసం ‘ఆచార్య’ పాత్రను కొన్ని సన్నివేశాల్లో తక్కువ చేసి చూపించారు. క్లైమాక్స్‌లో ఇన్‌స్పిరేషన్ అనే కోణంలో కూడా ‘ఆచార్య’ వెనక్కి తగ్గేలా చేశారు. సినిమా ‘సిద్ధ’ అయితే సిద్ధను హైలో ఉంచాలి. కానీ సినిమా ‘ఆచార్య’ కదా.