Balakrishna, Akhil: ఆ విషయంలో అఖిల్ జాగ్రత్త పడితే బెటర్!

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఇండస్ట్రీ హిట్ సాధించాలని భావిస్తున్నా బాక్సాఫీస్ వద్ద అఖిల్ కు ఇప్పటివరకు సరైన సక్సెస్ దక్కలేదు. “అఖిల్”, “హలో”, మిస్టర్ మజ్ను సినిమాల ఫలితాలు అఖిల్ కు భారీ షాకిచ్చాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా అఖిల్ రేంజ్ కు తగిన హిట్టైతే కాదు. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు.

యూత్ ను మెప్పించే స్టోరీలకు భారీగా కలెక్షన్లు రావడం లేదని గ్రహించిన అఖిల్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టారు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. మొదట ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో ఆ తేదీకి ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితులు లేవు.

దసరా పండుగ కానుకగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే అధికారక ప్రకటన రాకపోయినా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ కూడా దసరాకే రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. బాలయ్య సినిమాకు పోటీగా అఖిల్ మూవీ విడుదలైతే అఖిల్ సినిమా నష్టపోక తప్పదని చెప్పవచ్చు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

అఖిల్ సోలో రిలీజ్ డేట్ ను ఎంచుకుంటే సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపుగా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అఖిల్ ఈ సినిమా కొరకు రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోలేదని తెలుస్తోంది. సినిమా సక్సెస్ సాధిస్తే అఖిల్ కు లాభాల్లో వాటా దక్కనుందని సమాచారం. ఈ సినిమాతో అఖిల్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus