బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ గుర్తింపు కోసం ప్రభాస్ పడిన కష్టం అంతాఇంతా కాదు. ప్రభాస్ ఏకంగా ఐదేళ్లు బాహుబలి సిరీస్ సినిమాలకు పరిమితమయ్యారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించి విడుదలైన సాహో తెలుగులో సక్సెస్ సాధించకపోయినా హిందీలో మాత్రం సక్సెస్ అయింది. సాహో సినిమాతో ప్రభాస్ కు బాలీవుడ్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది.
అయితే పుష్ప పార్ట్1 పాన్ ఇండియా సినిమాగా మారడానికి కారణం ఒక విధంగా అల్లు అర్జున్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ లకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కనుంది. అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సంపాదించుకోవాలనుకునే ఆలోచనతో డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అయ్యేలా చేశారని సమాచారం. పుష్ప పార్ట్1 తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఇతర భాషల్లో మాత్రం బన్నీకి భారీస్థాయిలో గుర్తింపు దక్కింది.
పుష్ప తర్వాత బన్నీ నటించే సినిమాలు ఇతర భాషల్లో రిలీజ్ కావడం గ్యారంటీ అని తెలుస్తోంది. బన్నీ లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ స్థాయిలో కాకపోయినా బన్నీ తరువాత సినిమాలు హిట్ అయితే మాత్రం బన్నీ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగులో నెగిటివ్ టాక్ తో కూడా పుష్ప ది రైజ్ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. శ్యామ్ సింగరాయ్ సినిమాకు వచ్చే టాక్ ను బట్టి పుష్ప ఫైనల్ రిజల్ట్ తేలే అవకాశం ఉంటుంది.
బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయితే మాత్రం బన్నీకి పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు దక్కటం గ్యారంటీ అని చెప్పవచ్చు. బన్నీ ఇదే విధంగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం అల్లు అర్జున్ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందనడంలో సందేహం లేదు.