సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలకు సంబంధించి ఇప్పటికే థియేటర్లు ఫైనల్ అయ్యాయని సమాచారం అందుతోంది. నైజాంలో మూడు పెద్ద సినిమాలకు వేర్వేరుగా 200 థియేటర్ల చొప్పున కేటాయింపు జరుగుతోందని తెగింపు సినిమా మాత్రం కేవలం 40 థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. మరోవైపు వారసుడు మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ మారనుందని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న తేదీ కంటే రెండు రోజులు ఆలస్యంగా వారసుడు రిలీజ్ కావచ్చని ప్రచారం
జరుగుతుండగా దిల్ రాజు నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. వారసుడు, వీరసింహారెడ్డి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే కావడంతో రీరికార్డింగ్ పనుల విషయంలో ఆలస్యం జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు మూవీకి హైదరాబాద్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తే ఇతర సినిమాలకు సంబంధించి థియేటర్ల విషయంలో స్పష్టత వస్తుంది. వారసుడు సినిమా విషయంలో దిల్ రాజు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు వారసుడు ట్రైలర్ తో పోల్చి చూస్తే వీరసింహారెడ్డి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ విషయంలో వీరసింహారెడ్డి ట్రైలర్ దూకుడు మామూలుగా లేదు. మరికొన్ని గంటల్లో వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.
సంక్రాంతి సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఏ సినిమాలు పైచేయి సాధిస్తాయో అనే చర్చ జరుగుతోంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా థియేటర్ల సమస్య వల్ల అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారసుడు చిత్రయూనిట్ తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా ప్రమోషన్స్ చేయడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.