మూడు సినిమాలు… ఆరు కటింగ్‌లు అన్నట్లుగా సాగేది మన హీరోయిన్ల గురించి. ఒక్క సినిమా హిట్ అయితే చాలు తెలుగు రాష్ట్రాల్లో నగల షాప్‌లు, షాపింగ్ మాల్స్, మొబైల్ స్టోర్స్ ఓపెనింగ్‌లకు మన హీరోయిన్ల మేనేజర్ల ఫోన్లు మోగిపోయేవి. ‘మేడమ్‌గారు బాగా బిజీ అండీ’, ‘డేట్ చెప్పండి ఆ రోజు అవుతుందో లేదో చూద్దాం’ లాంటి డైలాగ్‌లు మేనేజర్ల నుండి వినిపించేవి. అయితే కరోనా మహమ్మారి పుణ్యమా అని ఇలాంటి మాటలకు ఆస్కారం లేకుండా పోయింది. కొత్త షాపుల ఓపెనింగ్స్ లేక హీరోయిన్లకు ఈ సైడ్ బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది.
నగలు, దుస్తులు, మొబైళ్లు… వీటికి సంబంధించిన షాపులు, రోజూ ఎక్కడో దగ్గర ఓపెన్ అవుతూనే ఉంటాయి. వాటి ముందు కట్టిన రిబ్బన్‌ను మన హీరోయిన్లలో ఎవరో ఒకరు కట్ చేస్తూనే ఉంటారు. అయితే ది ఓ 13 నెలల క్రితం. కరోనా ఫస్ట్ వేవ్‌తో చాలా ప్రదేశాల్లో బిజినెస్‌లు పడిపోయి కొత్త షాపులు తెరవలేదు. దీంతో హీరోయిన్ల, కత్తెరకు పని లేకుండా పోయింది. ఆ మధ్య కరోనా ప్రభావం తగ్గడంతో ఒకరిద్దరు హీరోయిన్లు మళ్లీ కత్తెర పట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్‌తో మళ్లీ డౌన్.
షాపింగ్ మాల్స్, డిజైనర్ కలెక్షన్ షో, నగల దుకాణాలు, మొబైల్ స్టోర్ల ఓపెనింగ్ చేస్తున్న ఫొటోలు పాతవి ఒకసారి రివైండ్ చేసుకుంటే అందులో స్టార్ హీరోయిన్లే కాదు, కొత్త భామలు, కాస్త ఫేడ్‌అవుట్ అయిన భామలు, ఒకటి అర సినిమాలు చేసిన అమ్మాయిలూ కనిపిస్తారు. ఇప్పుడు వీరందరికీ సైడ్ బిజినెస్ ఆగిపోయినట్లే పెద్ద నాయికలు అయితే గంటలకు ₹5 లక్షలు నుండి ₹10 లక్షలు తీసుకునేవారట. కొత్త నాయికలు అయితే అందులో రీసెంట్ హిట్స్ కొట్టినవాళ్లయితే ₹3 లక్షల నుండి ₹5 లక్షలు అందుకునేవారట. మరీ కొత్తవాళ్లు, అరకొర సినిమా వాళ్లయితే ₹లక్ష తీసుకునేవారట.
అయితే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా షాపు ఓపెనింగ్స్ లేవా అంటే… ఉన్నాయనే చెప్పాలి. కానీ హీరోయిన్లనే పిలవడం లేదు అంటున్నారు. హీరోయిన్స్ వస్తే జనాలు ఎక్కువమంది వస్తారు. వాళ్లను ఆపలేక, కొవిడ్ నిబంధనలు పాటించలేక షాపు యజమానాలు నానా బాధలు పడాయి. అందుకే కరోనా ఒక కారణం అయితే, దాని నిబంధనలు పాటింపు మరో కారణంగా హీరోయిన్లకు సైడ్ బిజినెస్ లేకుండా చేసింది. అంతెందుకు హీరోయిన్ల కొత్త యాడ్స్ కూడా తగ్గిపోయాయి. అలా కూడా వాళ్ల సంపాదన డౌన్ అయినట్లే. మళ్లీ ఎప్పుడు పరిస్థితులు సెట్ అవుతాయో, హీరోయిన్ల మేనేజర్ల ఫోన్లు ఎప్పుడు బిజీ అవుతాయో.