పూజా పాపకు కరోనా దెబ్బ గట్టిగా తగిలేలా ఉంది

  • March 25, 2020 / 01:29 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలలో నటిస్తుంది. అక్కినేని హీరో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ జాన్ మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కతుంది.

దర్శకుడు రాధా కృష్ణ సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకోవడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ షెడ్యూల్ వాయిదా వేశారు. ఈ వాయిదా కారణంగా పూజ హెగ్డే సల్మాన్ ప్రాజెక్ట్ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది.

జాన్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలకు కేటాయించిన డేట్స్ వాయిదా కారణంగా పొడిగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనితో సల్మాన్ చిత్రం కభీ ఈద్ కభీ దివాళి చిత్రానికి డేట్స్ ఇవ్వలేని ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. ఒక వేళ సల్మాన్ చిత్రం సెట్స్ పైకి వెళ్లే నాటికి పూజ ప్రభాస్, నిఖిల్ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఆ చిత్ర దర్శకుడు ఫర్హాద్ సామ్జి మరొకరి హీరోయిన్ గా తీసుకోవడం ఖాయం. మరి చూడాలి పూజ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ని ఎలా బ్యాలన్స్ చేస్తుందో…

Most Recommended Video


నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus