Aishwarya Rai: చిక్కుల్లో పడ్డ ఐశ్వర్య రాయ్.. 10 రోజులే గడువు

‘అందం అంటే ఐశ్వర్య రాయ్’.. ‘ఐశ్వర్య రాయ్ అంటే అందం’… అని అంతా అంటుంటారు. 50 ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది ఐశ్వర్య రాయ్ అనడంలో సందేహం లేదు.అభిషేక్ బచ్చన్ ను పెళ్ళి చేసుకోవడానికి ముందు ఐశ్వర్యరాయ్ వివాదాలతో వార్తల్లో నిలిచేది. కానీ పెళ్లయ్యాక అలాంటి వివాదాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమె గురించి ఓ న్యూస్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే ఓ ల్యాండ్ కి సంబంధించిన టాక్స్ విషయంలో ఈమెకు లీగల్ నోటీసులు అందాయట. వివరాల్లోకి వెళితే.. నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకా ఆదివాడి గ్రామంలో ఐశ్వర్యరాయ్ ఒక హెక్టారు భూమి కొనుగోలు చేశారు. దీనికి గాను ఆమె 21,960 టాక్స్ చెల్లించాల్సి ఉంది.చాలా సార్లు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆమెకు లేఖలు పంపినా.. ట్యాక్స్ చెల్లించలేదట. అందుకే ఈమెకు లీగల్ నోటీసులు పంపడం జరిగింది.

దీంతో నిద్ర మేల్కొన్న ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ “త్వరలోనే అన్ని బకాయిలను క్లియర్ చేస్తానని తెలియజేశారు. ఈ ఇష్యు గురించి… సిన్నార్ తహసీల్దార్ ఏక్నాథ్ బంగాలే మాట్లాడుతూ. “ఐశ్వర్యరాయ్ విండ్మిల్లో పెట్టుబడి పెట్టారు. 2009లో ఆమె కొనుగోలు చేసిన భూమికి ఇన్నాళ్లూ టాక్స్ కడుతూ వచ్చింది. ఈ నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన పన్ను మాత్రమే పెండింగ్లో ఉంది. మా ఆదాయ అంచనా సంవత్సరం ఆగస్టు నుండి ప్రారంభం కాబోతుంది.

ఈ ఏడాదికి గాను ఆమె కట్టాల్సిన టాక్స్ మాత్రమే పెండింగ్లో ఉంది. ఈ విషయంలో మేము ఐశ్వర్యరాయ్ కి రెండు సార్లు డిమాండ్ నోటీసు పంపాము. కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన లేదు. జనవరి 9న పది రోజుల్లోగా పన్ను చెల్లించాలి అంటూ మళ్ళీ నోటీసులు పంపాము. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లీగల్ అడ్వైజర్ రేపటిలోగా పన్ను చెల్లిస్తామని మాకు తెలియజేశారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus