పవన్-క్రిష్ సినిమా.. కోహినూర్ ఫైట్ హైలైట్ అట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ లో భాగంగా ఇప్పుడు కొన్ని ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ‘కోహినూర్’ వజ్రం కోసం జరిగే పోరాటం నేపధ్యంలో ఈ ఫైట్ సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీనికోసం స్పెషల్ ఫైట్ సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కోహినూర్ ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

స్వాతంత్య్రం రాకముందు జరిగిన పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోపక్క పవన్ ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus