Pushpa: ‘పుష్ప’ అంటే క్రికెటర్లకు భలే ఇష్టం

‘పుష్ప… పుష్పరాజ్‌’ అంటూ ఏ ముహూర్తాన అల్లు అర్జున్‌ అన్నాడో కానీ… అప్పటి నుండి సోషల్‌ మీడియాలో దానికి సంబంధించిన రీల్సే కనిపిస్తున్నాయి. ‘చూపే బంగారమాయెనే..’ అంటూ శ్రీవల్లి కోసం పుష్పరాజ్‌ చెప్పులు వదిలేసి మరీ పాడుకుంటే, దానిని కూడా రీల్స్‌, షార్ట్‌ వీడియోస్‌ చేసేస్తున్నారు. పిల్లల నుండి పెద్దోళ్ల వరకు, సినిమా వాళ్ల నుండి క్రీడాకారుల వరకు ఈ ‘పుష్ప’రాజ్‌ మేనియా పట్టుకుంది. ముఖ్యంగా క్రికెటర్లలో ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పాలి. మొత్తంగా నలుగురు క్రికెటర్లు ‘పుష్ప’గా మారారు.

‘పుష్ప’గా మారిన క్రికెటర్లలో రవీంద్ర జడేజా కాస్త స్పెషల్‌. ఎందుకంటే అతను రెండుసార్లు ‘పుష్ప’రాజ్‌ అయ్యాడు. తొలిసారి జడేజా ‘తగ్గేదేలే’ అంటూ డైలాగ్ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆ తర్వాత ‘పుష్ప’ లా మారి గెడ్డం, బీడీతో ఒక ఫొటో లాంచ్‌ చేశాడు. ఇక గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా ఆ మధ్య పుష్పరాజ్‌గా మారి వీడియో రిలీజ్‌ చేసి అలరించాడు. ఇద్దరు సీనియర్లు అయిపోయాక ఇద్దరు జూనియర్లకు ఈ మేనియా పట్టుకుంది. వాళ్లిద్దరే సూర్య కుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌. ఈ ఇద్దరి తాజా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘శ్రీవల్లి’ పాట హిందీ వెర్షన్‌ పాటకు టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ చెప్పులు జారే స్టెప్పు వేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. త్వరలో మొదలయ్యే వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఈ క్రమంలో హోటల్‌లో ఇలా స్టెప్పులేశారు. ఆ వీడియోను ‘పుష్ప’ టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ చెప్పులు జారేసే స్టెప్పుకు మంచి పేరొచ్చింది కూడా. సింపుల్‌గా ఉన్నా… భలే ఉందంటూ ఆ మధ్య విజయ్‌ దేవరకొండ కూడా అన్నట్లు గుర్తు.

ఇక ఈ సినిమా సంగతికొస్తే గతేడాది ఆఖరులో విడుదలై కాస్త డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే తెలుగేతర రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో దూసుకెళ్లి భారీ వసూళ్లు అందుకుంది. తెలుగులో కూడా ఆ తర్వాత మంచి డబ్బులే వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో కూడా సినిమాకు స్ట్రీమింగ్‌ బాగా జరుగుతోందని టాక్‌. థియేట్రికల్‌ రిలీజ్‌లో సినిమాకు సుమారు ₹300 వచ్చాయని టాక్‌.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus