అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీలీలపై (Sreeleela) పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(AISF) విజయవాడ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేసి చాలా మంది యువతని వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇలాంటి ప్రచారం వల్ల… విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి పెద్ద కాలేజీల్లో సీట్ల కోసం ఎగబడుతున్నారు. యాజమాన్యాలు భారీగా ఫీజులు వంటివి డిమాండ్ చేసినా వెనకడుగు వేయకుండా ..
ఇలాంటి కాలేజీల్లో తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. ఫైనల్ ర్యాంకులు వంటివి రాకపోగా… కొంతమంది సబ్జెక్ట్..లు వంటివి పోయి ఆత్మహత్యలు వంటి అఘాయిత్యాలకు కూడా పాల్పడుతుండటం గమనార్హం. మరోపక్క నెంబర్ వన్ ర్యాంకు వచ్చింది అని ప్రతి కాలేజీ కూడా హోర్డింగ్లు వంటివి వేసుకుంటున్నాయి. వాస్తవానికి ఎక్కడో నార్త్ లో వచ్చిన ర్యాంక్ ను.. ఇక్కడ వచ్చినట్టు చెప్పుకోవడం. అసలు ఇందులో నిజం ఉందా లేదా? అనేది తెలుసుకోకుండా అల్లు అర్జున్, శ్రీలీల వంటి వారు కార్పొరేట్ కాలేజీలను ప్రమోట్ చేయడం వంటివి కూడా..
ఒక రకంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వంటివే’ AISF అభిప్రాయపడింది. మరి ఈ ఇష్యూకి అల్లు అర్జున్, శ్రీలీల ఎలా స్పందిస్తారో చూడాలి. సెలబ్రిటీలు పలు బ్రాండ్లకి ప్రచారకర్తలుగా వ్యవహరించడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. కానీ డబ్బుల కోసం ఎలాంటి బ్రాండ్ ను అయినా ప్రమోట్ చేయడానికి కొంతమంది హీరో, హీరోయిన్లు రెడీ అయిపోతున్నారు. ఇలా చిక్కుల్లో పడుతున్నారు.
సినీ తారల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.
కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆరోపణ.#AISF #UANow #AndhraPradesh pic.twitter.com/RVBKWysFjQ
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 21, 2025