టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు (D. Suresh Babu) తనయుడు దగ్గుబాటి అభిరామ్ అందరికీ సుపరిచితమే. తేజ (Teja) దర్శకత్వంలో తెరకెక్కిన ‘అహింస’ (Ahimsa) చిత్రంతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది సమ్మర్ కి రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత అభిరామ్ రెండో సినిమా చేయలేదు. ఇతను ఆల్మోస్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే గతేడాది డిసెంబర్లో ఇతను ప్రత్యూష అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Daggubati Abhiram
శ్రీలంకలోని ఓ ఫంక్షన్ హాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అభిరామ్ పెళ్లి జరిగింది. దగ్గుబాటి ఫ్యామిలీకి దూరపు బంధువు, మరదలు వరుస అయినటువంటి ప్రత్యూషని అభిరామ్ వివాహం చేసుకోవడం జరిగింది. తాజాగా ప్రత్యూషకి డెలివరీ అయ్యి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగితేలుతోంది అని స్పష్టమవుతుంది. ప్రత్యూష గర్భవతి అయినట్టు ఎటువంటి వార్త కానీ లేదా ఫోటో కానీ బయటకి రాలేదు.
దగ్గుబాటి ఫ్యామిలీ.. ఫ్యామిలీ విషయాలు మీడియాలో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ విషయం మరోసారి చాటి చెప్పినట్టు అయ్యింది. మరోపక్క అభిరామ్ ప్రస్తుతం ‘ది రైటర్స్ రూమ్’ అనే కేఫ్ ను నడుపుతున్నాడు. హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్ పక్కనే ఇది ఉంటుంది. దీని పనులతో పాటు రామానాయుడు స్టూడియో పనులు కూడా చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు అభిరామ్ దగ్గుబాటి.