Dhanush: మీరు గట్టిగా అడిగితే ఆయనే నా ఫేవరెట్ హీరో: ధనుష్

  • May 4, 2023 / 01:07 AM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ధనుష్‌ రీసెంట్‌గా బ్రేక్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు మీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు అని ప్రశ్నించగా ఈయన ఏమాత్రం సంకోచం వ్యక్తం చేయకుండా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం చెప్పారు. ధనుష్ గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో అప్పటి ట్వీట్ ను కూడా అభిమానులు వైరల్ చేస్తున్నారు.ఇలా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఏంతో ఇష్టం అని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన ఫేవరెట్ హీరోల గురించి చెబుతూ ఈయన చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకు అజిత్ ఇద్దరు కూడా చాలా ఇష్టమని తెలిపారు. అయితే మీరు చాలా గట్టిగా అడిగితే మాత్రం తాను రజనీకాంత్ అంటూ తన ఫేవరెట్ హీరో పేరు చెబుతానని తెలియజేశారు.

ఇక ధనుష్ (Dhanush) సమంతతో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సెషన్ లో భాగంగా ధనుష్ సమంత గురించి మాట్లాడుతూ సమంత చాలా టాలెంట్ కలిగినటువంటి నటి అని అలాంటి ఆమెతో కలిసి నటించడం తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తెలియజేశారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus