Dasara Twitter Review: ‘దసరా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నటించాడు.

టీజర్, ట్రైలర్ (Dasara) రెండు పాటలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందట. ధరణి పాత్రలో నాని పెర్ఫార్మన్స్ ఎంగేజ్ చేస్తుందని, వెన్నెల గా కీర్తి సురేష్ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసిందని అంటున్నారు.విజువల్ గా ఓకే అనిపించిన ఈ సినిమా సాంగ్స్ పరంగా కూడా ఓకే అనిపించిందని ..

కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ అయ్యిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మాత్రం చాలా నీరసం తెప్పించిందని, ఒక్క యాక్షన్ బ్లాక్ తప్ప సినిమా ఎక్కడా కూడా కోలుకోలేదని, డైలాగ్స్ కూడా క్లారిటీ లేదని అంటున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ అతను ఎందుకో నాని పాత్ర పై తప్ప కథనం పై ఫోకస్ పెట్టలేదని వారంటున్నారు. మరి మార్నింగ్  షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus