పవన్ కళ్యాణ్ Pawan Kalyan) కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ సంగతి అందరికీ తెలిసిందే. విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ సింగపూర్ కి వెళ్లడం జరిగింది. పిల్లాడికి చేతులు, కాళ్లకు గాయాలు కాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్టు నిన్న పవన్ కళ్యాణ్ టీం వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మెల్లగా కోలుకుంటున్నట్లు కూడా పవన్ టీం తెలిపింది. మరోపక్క పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్లతో పాటు సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనాల్సి ఉంది.
ఇటీవల ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసం 4 రోజులు డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే కొంత బరువు కూడా తగ్గారు. సరిగ్గా షూటింగ్లో జాయిన్ కావాల్సిన టైంలో ఇలా జరిగింది. అయితే మరోపక్క ‘వీరమల్లు’ టీంకి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తుంది. మే 9 న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ కావాలి. లేదు అంటే డిజిటల్ రైట్స్ నిమిత్తం చెల్లించిన డబ్బులో సగం వరకు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందట.
అందుకు తగ్గట్టే అగ్రిమెంట్ కూడా జరిగింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. ఇప్పటికే మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని మే 9 కి వాయిదా వేసినట్టు టీం వెల్లడించింది. మరి రిలీజ్ కి ఇప్పుడు కరెక్ట్ గా నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి..!