అఖిల్ ని (Akhil Akkineni) పాపం సోషల్ మీడియాలో రీరీఎంట్రీ అని ట్రోల్ చేస్తుంటారు. కానీ.. ఒక నటుడిగా తన ప్రతి సినిమాలో బెస్ట్ ఇచ్చాడు. “అఖిల్”(Akhil) మొదలుకొని “ఏజెంట్” (Agent) వరకు ప్రతి సినిమాలో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు. అయితే.. సినిమాల రిజల్ట్స్ మాత్రం ఎందుకో సరిగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే.. “ఏజెంట్” తర్వాత గ్యాప్ తీసుకొని మునుపెన్నడు కనిపించని విధంగా రూరల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు.
“లెనిన్” (Lenin) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ సరసన శ్రీలీల (Sreeleela) కథానాయికగా కనిపించనుంది. అక్కినేని స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఇంతకు మునుపు “వినరో భాగ్యము విష్ణుకథ” (Vinaro Bhagyamu Vishnu Katha) అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది.
ఇక ఇవాళ అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన “లెనిన్ టీజర్”లో బోలెడన్ని మైథలాజికల్ రిఫరెన్సులు ఉండగా.. టీజర్ లో “గతాన్ని తరమాడికి పోతా.. మా నాయిన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా, పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్టా నిలబడాలంటే..” అంటూ అఖిల్ పాత్ర చెప్పే డైలాగ్ లో మంచి డెప్త్ తోపాటు పర్సనల్ కనెక్ట్ కూడా ఉంది.
ఎందుకంటే.. అక్కినేని కుటుంబం పేరు నిలబెట్టాల్సిన బాధ్యత అఖిల్ కి ఉంది. “లెనిన్”తో అది కచ్చితంగా నిలబెట్టేలా ఉన్నాడు. ఇకపోతే.. టీజర్ కి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది. అఖిల్ సినిమాకి తమన్ సంగీతం అందించడం “మిస్టర్ మజ్ను” (Mr. Majnu) తర్వాత ఇది రెండో సారి.