Deepika Padukone: ఇంటిమేట్‌ సీన్లపై దీపిక కామెంట్‌ వైరల్‌!

పెళ్లి అయిన తర్వాత కథానాయికలకు అవకాశాలు తగ్గి, క్రమంగా సినిమాలకు దూరమైపోయే ఇండస్ట్రీ మనది. అయితే ఇటీవల మన దగ్గర పరిస్థితి మారింది అనుకోండి. అదే బాలీవుడ్‌లో అయితే ఎప్పటినుండో పెళ్లి అయిన తర్వాత సినిమాలు ఆపడం పక్కన పెడితే… ఇంకా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఆ నాయికలు కూడా అప్పటికంటే ఇంకాస్త హాట్‌ సినిమాలు చేస్తూ ఉంటారు. గతంలో కొంతమంది నాయికలు ఈ పని చేశారు. ఇప్పుడు దీపికా పడుకొణె కూడా అదే పని చేస్తోంది.

దీపిక పడుకొణె, అనన్య పాండే కలసి నటించిన ‘గెహ్రాహియా’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బోల్డ్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయని ఆ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంటిమేట్‌ సీన్ల గురించి దీపిక మాట్లాడింది. ఈ చిత్రంలో దీపిక- సిద్ధాంత్‌ మధ్య ముద్దు సీన్లు, బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్‌ చూస్తేనే అర్థమైపోతుంది. వాటి గురించి చెబుతూ దీపిక.. ఇంటిమేట్‌ సీన్లకు వయసుతో పనేంటి అని అందట.

‘గెహ్రాహియా’ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేదితో కొన్ని ఇంటిమేట్‌ సీన్స్‌ చేశాను. అయితే కొన్ని ముద్దు సీన్లను చూపించి ప్రేక్షకులను ఆకర్షించి, సినిమా చూసేలా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీయలేదు. నేటి తరం బంధాలు – అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రేమలో ఉన్న ఇద్దరూ చివరికి మోసపోతారు. దాని కన్నా ముందు వారి ప్రేమ ప్రయాణంలో వచ్చినవే ఆ సన్నివేశాలు. అందుకే కథకు అవసరమైనట్లుగా ఆ సీన్స్ చేశాం అని చెప్పింది దీపిక.

ఇంటిమేట్‌ సీన్స్‌ ఎప్పుడూ కథలో భాగంగానే చేస్తాం. ఆ సన్నివేశాలు కేవలం ఒక వయసు వారో, ఒక జెండర్‌ వారో చేయాలని ఎక్కడా లేదు. అలా ఎవరైనా అంటే నేను అంగీకరించను. కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు అంగీకరిస్తా అంటూ తన ఉద్దేశం చెప్పింది దీపిక. అయితే ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం. శకున్‌ బత్రా ఈ సినిమా చేయకపోయుంటే నేను ఆ పాత్రకు ఓకే చెప్పేదాన్ని కాదేమో. ఇంటిమేట్‌ సీన్స్‌ విషయంలో నన్ను ఇలానే నటించు అని గిరి గీసి చెప్పుంటే నో చెప్పేసేదాన్ని. సినిమాకి అవసరమైన సన్నివేశాలను కంఫర్ట్‌ ఇచ్చే చిత్రీకరించారు అని చెప్పింది దీపిక.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus