Prabhas: ‘ప్రాజెక్ట్ కె’ గురించి షాకింగ్ అప్డేట్..పెద్ద ఝలక్ ఇచ్చిందిగా..!

ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘వైజయంతి స్టూడియోస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు ఆయన.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణెని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.’ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభమైంది.

మొదటి షెడ్యుల్ కోసం ఆర్.ఎఫ్.సి లో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. భారీ బడ్జెట్ తో ఈ సెట్ ను ఆర్ డైరెక్టర్లు వేసినట్టు తెలుస్తుంది.మన ఊహకందని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ సెట్ ద్వారా మనం చూడొచ్చట. ఈ సెట్లో ప్రభాస్, దీపికా పదుకోణె పై ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారట. దీనికి సంబంధించిన న్యూస్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ వీడియోలో దీపికా…

ప్రభాస్ చేయి పట్టుకొని పైకి లేస్తూ కనిపిస్తుందని తెలుస్తుంది. ఇక మొదటి షెడ్యుల్‌ కూడా పూర్తయ్యిందని వినికిడి. దీపిక పడుకోణెకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారట. దీంతో ఆమె పనైపోయింది కాబట్టి…దీపిక హైదరాబాద్ ‘ప్రాజెక్ట్ కె’ టీంకి అలాగే హైదరాబాద్ కి గుడ్ బై చెప్పేసిందట. హైదరాబాద్ తనకి ఎంతో ప్రేమ పంచిందని… ముఖ్యంగా ప్రభాస్ ఇచ్చిన ఆతిధ్యం మర్చిపోలేనిదని.. తన జీవితంలో ఎప్పుడూ తినని ఫుడ్ ఈ సినిమా సెట్ లో తిన్నానని ఆమె చెప్పుకొచ్చింది.

రెండో షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా? మళ్ళీ ఎప్పుడు హైద్రాబాద్‌ కు వస్తానా అని ఆశపడుతున్నట్టు దీపిక తెలిపినట్టు సమాచారం. ఇక ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎప్పుడో తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus