Bigg Boss Telugu 6: హౌస్ మేట్స్ తో ఆటాడుకున్న నాగార్జున..! అసలు మజా అదే..!

బిగ్ బాస్ సీజన్ 6 దసరా సంబరాల్లో మునిగి తేలింది. 4 గంటల పాటు నాన్ స్టాప్ గా బిగ్ బాస్ షోని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. హీరోయిన్స్ అందమైన డ్యాన్స్ లతో, అదిరిపోయే పాటలతో స్టేజ్ దద్దరిల్లింది. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన నాగార్జున శనివారం కీర్తి పడిన బాధని తీర్చే ప్రయత్నం చేశారు. చంటిని ఈసీజన్ మొత్తానికి కెప్టెన్ అవ్వకుండా ఓటు వేసింది కీర్తి. పనిచేసేటపుడు తనని కేవలం కెమెరాలకోసమే పనిచేస్తున్నానని చెప్పాడని రీజన్ చెప్పింది.

దీంతో నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. చంటి అన్నమాటలు వీడియో వేసి మరీ చూపించాడు. ఆడియన్స్ తో పాటుగా, హౌస్ మేట్స్ కి కూడా క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత అమ్మాయిలకి, అబ్బాయిలకి ఛాలెంజస్ పెట్టాడు. ఇందులో అమ్మాయిల టీమ్ గెలిచింది. గేమ్స్ మద్యలో సెలబ్రిటీలు స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ ని పలకరించారు. ముఖ్యంగా గోస్ట్ టీమ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్, ఇంకా హీరోయిన్ సోనాల్ చౌహాన్ లు ఇద్దరూ వచ్చి సందడి చేశారు. హౌస్ మేట్స్ కి డమ్మీ గన్ ఇచ్చి ఇంట్లో ఎవరిలో చెడు ఉందో వారిని పేల్చమని చెప్పారు.

దీంతో నామినేషన్స్ లెవల్లో ఒకరికొకరు రీజన్స్ చెప్తూ ఈ ఆట ఆడారు. ఇక్కడే కీర్తి, గీతు, బాలాదిత్య, చంటి , రేవంత్, ఇనయ, ఇలా అందరినీ పేల్చేప్రయత్నం చేశారు హౌస్ మేట్స్. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పారు. నామినేషన్స్ లో చెప్పే రీజన్స్ ని ఇక్కడ బయటపెట్టారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ ప్రతి సీజన్ లో ఆడే ఛేదులడ్డు, తీపిలడ్డు గేమ్ ని ఆడారు. అసలే ఉప్పగా ఉన్న పానీ పూరీని తిన్న గీతు ఛేదులడ్డూ తినేందుకు బాగా ఇబ్బంది పడింది. ఈ గేమ్స్ ఆడుతునే హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చారు.

చివరకి సుదీప, ఆరోహి ఉన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఎవరూ ఇంటి నుంచీ వెళ్లిపోతారా అని ఆసక్తిగా చూశారు. ఆరోహి ఎలిమినేట్ అయిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ముఖ్యంగా కీర్తిభట్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆరోహి ఎలిమినేషన్ ని చాలామంది హౌస్ మేట్స్ తీస్కోలేకపోయారు. ఆర్జే సూర్య, కీర్తి, మెరీనా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎపిసోడ్ లో అసలు మజా వచ్చింది ఎలిమినేషన్ అప్పుడే. నిజానికి హౌస్ మేట్స్, ఆడియన్స్ అందరూ కూడా సుదీప ఎలిమినేట్ అయిపోతుందని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే, ఆరోహి – ఆర్జే సూర్య ఇద్దరిమద్యలో ఏదో ఉందని ఆడియన్స్ అనుకుంంటున్నారు.

వాళ్లు హౌస్ లో అలాగే బిహేవ్ చేస్తూ కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కారణంగా ఆరోహి ఈవారం ఉంటుందనే అనుకున్నారు అందరూ. కానీ, అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఇక దసరా సంబరాల్లో హీరోయిన్ శ్రద్ధాదాస్, రుతికా సింగ్ డ్యాన్స్ లు హైలెట్ గా నిలిచాయి. అలాగే శ్రావణ భార్గవి, శ్రీకృష్ణ పెర్ఫామన్స్ కూడా అద్దిరిపోయింది. ఈ దసరా సంబరాలు జరుగుతున్నప్పుడే హౌస్ మేట్స్ తో ఆటలు ఆడించి వారిని ఒక ఆట ఆడుకున్నాడు కింగ్ నాగార్జున. అదీ మేటర్.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus