Deva Katta: క్రేజీ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు దేవా కట్టా!

తెలుగు సినిమా ఘనతను, ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా ఘనతను విశ్వాంతరాలకు వ్యాపింపజేపసింది ‘బాహుబలి’. ఆ సినిమాలో హీరోలతోపాటు సమానంగా నిలిచే పాత్ర శివగామి. ఆ పాత్రను కీకలంగా తీసుకొని ఆనంద్‌ నీలకంఠన్‌ ‘ది రైజ్‌ ఆఫ్‌ శివగామి’ అనే పుస్తకం రాశారు. దానిని అదే పేరుతో వెబ్‌ సిరీస్‌గా రూపొందించాలని చాలా రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ ప్రయత్నాలు చేసింది. దానికి ప్రవీణ్‌ సత్తారు, దేవా కట్టా లాంటి దర్శకుల్ని తీసుకుంది. అయితే ఆ ప్రాజెక్టు నుండి ఆ ఇద్దరూ తప్పుకున్నారని, తీసేశారని వార్తలొచ్చాయి. అయితే దీని వెనుక జరిగింది వేరే ఉంది అని దర్శకుడు దేవా కట్టా చెబుతున్నారు.

హాలీవుడ్ పాపులర్‌ వెబ్‌ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ‘బాహుబలి’ సిరీస్‌ను రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్‌ అనుకుంది. సుమారు నాలుగేళ్ల కిందట జరిగిన విషయం ఇది. దీని కోసం దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారు కొంతకాలం పని చేశారు. అయితే ఇప్పుడు వేరే టీమ్‌తో స‌రికొత్త‌గా ‘బాహుబ‌లి’ సిరీస్ తీయ‌డానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధ‌మ‌వుతోంది. దీంతో ప్రవీణ్‌ సత్తారు, దేవా కట్టా ఎందుకు ఆ ప్రాజెక్టులో లేరు అనే ప్రశ్న మొదలైంది.

నెట్ ఫ్లిక్స్ వాళ్లకు దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారుతో సింక్‌ అవ్వడం లేదని, అందుకే వాళ్లతో డీల్‌ ఆగిపోయింది అని వార్తలొచ్చాయి. అయితే ఆ సిరీస్‌ కోసం అంత సమయం వెచ్చించలేక తామే బయటకు వచ్చేశాం అని దేవా కట్టా తాజాగా వెల్లడించారు. ‘బాహుబలి’ సిరీస్‌ చాలా పెద్ద ప్రాజెక్టు. ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో, నాలుగైదేళ్లలో పూర్తి చేసేది కాదు. దాని కోసం ఇంకా చాలా టైమ్‌ కావాలి. మా ప్రాజెక్టుల దృష్ట్యా అంత సమయం కేటాయించడం కుదరదని తేలి మేమే బయటకు వచ్చేశాం అని దేవా కట్టా చెప్పారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus