చిన్న సినిమా, అందులోనూ డెబ్యూ డైరక్టర్… చిత్రీకరణ అంత సులభంగా ఏమీ సాగదు. సినిమా ఎలా వస్తుంది, తర్వాత పరిస్థితులు ఏంటి అనే విషయాల్లో ఎక్కడో నమ్మకం తక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కనపెడితే నిర్మాతలు కూడా పెద్దగా ఫండింగ్ ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఒకరు ఒకటికి మించిన పనులు చేస్తుంటారు. ‘వెన్నెల’ సినిమాకు ఇలానే జరిగిందట. ఆ రోజుల్లో జరిగిన విషయాలను దర్శకుడు దేవా కట్టా ఇటీవల వివరించారు.
‘వెన్నెల’తో టాలీవుడ్‌కు కామెడీ జోనర్‌లో కొత్త రకం చూపించారు దేవా కట్టా. రాజా, పార్వతీ మేనన్, శర్వానంద్ లాంటి నటులతో చాలా చిన్న సినిమాగా రూపొందింది. అయితే విడుదలైన తర్వాత మంచి విజయమే అందుకుంది. ఆ సినిమా సమయంలో దర్శకుడు దేవా కట్టా.. వ్యానిటీ వ్యాన్ నడిపారట. ‘‘వెన్నెల’ చేసినప్పుడు నాకున్న వనరులు చాలా తక్కువ. దీంతో వ్యానిటీ వ్యాన్‌ని నేను స్వయంగా నడుపుకుంటూ సెట్‌కి వెళ్లేవాణ్ని’’ అని చెప్పారు దేవా కట్టా.
అంటే సినిమా సెట్‌కి వెళ్లేవారకు డ్రైవర్‌ని, అక్కడికెళ్లాక దర్శకుడిని అన్నమాట. అయితే అప్పట్లో స్వేచ్ఛ ఉండేది. ఆ తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి రాలేదు అంటూ చెప్పుకొచ్చారు దేవా కట్టా. ఆ సినిమా విజయం ఇచ్చినా ఆ తర్వాత ఐదేళ్ల వరకు దేవా కట్టా మరో సినిమా చేయలేదు. 2005లో ‘వెన్నెల’ వస్తే… 2010లో ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ సినిమాకు కూడా ఆయనకు పెద్దగా వనరులు ఉండేవి కావట.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!