ఈ రోజుల్లో ఒక సినిమా 4 వారాల పాటు బాక్సాఫీస్ వద్ద నిలబడటమే రేర్ ఫీట్ అయిపోయింది. అది కూడా టాక్ బాగుంటేనే.! లేదు అంటే.. మొదటి వారానికే వాషౌట్ అయిపోతున్న పరిస్థితి. పెద్ద సినిమాలు అయితే హీరో ఇమేజ్ వల్ల.. కొన్ని సెంటర్స్ లో రెండు వారాల పాటు నిలబడుతున్నాయి.అలాంటిది ‘దేవర’ (Devara) అనే సినిమా విజయవంతంగా 50 రోజులు ఆడింది. సెప్టెంబర్ 27న ‘దేవర'(మొదటి భాగం) రిలీజ్ అయ్యింది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
Devara
అయినా సరే.. ఎన్టీఆర్ (Jr NTR) స్టార్ డం కావచ్చు, మాస్ ఆడియన్స్ లో అతనికి ఉన్న క్రేజ్ కావచ్చు.. బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ సక్సెస్ సాధించడంలో సాయపడ్డాయి అని చెప్పవచ్చు. గాంధీ జయంతి, దసరా హాలిడేస్..కూడా ‘దేవర’ కి కలిసొచ్చాయి. ‘దావూదీ’ అనే పాటను రిలీజ్ తర్వాత యాడ్ చేయడంతో ఆడియన్స్ ‘దేవర’ ని రిపీటెడ్ గా చూశారు.
ఈ మధ్యనే అంటే నవంబర్ 8న ‘దేవర’ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. 6 వారాలకే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని ఏరియాల్లో ‘దేవర’ 50 రోజులు ప్రదర్శింపబడటం అనేది ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ‘దేవర’ చిత్రం 52 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇందుకు చిత్ర బృందం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఓటీటీలో ‘దేవర’ ని వీక్షించిన వారు ‘ ‘దేవర’ని చంపింది ఎవరు? యథి క్యారెక్టర్ ఎవరిది?’ అనే ప్రశ్నలపై చర్చించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.