‘దేవర’ (Devara). సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఓ చర్చ జరుగుతోంది. సినిమా ఫైనల్ ప్రింట్ రెడీ అయ్యాక కూడా ఎడిటింగ్ జరిగింది అని ఆ చర్చ సారాంశం. ఎనిమిది నిమిషాల సినిమాను కట్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ముందు వచ్చిన సమాచారానికి డబుల్ ఎడిట్ జరిగింది అంటున్నారు. అంటే సుమారు 15 నిమిషాల సినిమా కత్తెరకు గురైంది అంటున్నారు. ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే ‘దేవర’.
Devara
ఈ సినిమాను ఈ నెల 27న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆఖరి సమయంలో హడావుడి ఉండకూడదు అని విదేశాలకు ఇప్పటికే సినిమా క్యూబ్ ద్వారా పంపించేశారు అని అంటున్నారు. ఈ క్రమంలో అక్కడి సినిమా నిడివి, ఇక్కడి సినిమా నిడివి ఒకటి కాదు అని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా లెంగ్త్ 2.42 గంటలు అని చెబుతున్నారు. నిజానికి సెన్సార్‌కు ముందు సినిమా నిడివి 2.47 గంటలు ఉండేది.
అయితే అమెరికాకు పంపిన ఐమాక్స్ ప్రింట్ మాత్రం 3.10 గంటలు ఉందని అంటున్నారు. ఆ లెక్కన అక్కడికి, ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాలి. దీని వెనుక కార్తికేయ ఉన్నాడు అని చెబుతున్నారు. ఇటీవల కార్తికేయ సినిమా చూశాడని, సెకండాఫ్ బాగా నచ్చింని… క్లైమాక్స్ ఇరవై నిమిషాలు బాగుందని చెప్పాడని ఓ పాజిటివ్ వార్త బయటకు వచ్చింది. మరి నిజంగానే ఆయన చూశారా? ఆయన చెబితేనే ఈ ఎడిట్‌లు జరిగాయా అనే డౌట్ మొదలైంది.
ఈ విషయం ఇలా ఉంటే.. కొరటాల తెరకెక్కించిన ఈ సినిమాకు తారక్ స్నేహితులు బాగానే సాయం చేస్తున్నారు. కార్తికేయ ఇలా.. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) డిస్ట్రిబ్యూషన్ పరంగా బ్యాకప్ చేస్తున్నారు. తారక్‌కు విజయం అత్యవసరం అనుకుంటున్న ఈ సమయంలో తారక్‌కి వీళ్లు ఇస్తున్న బ్యాకప్ చూస్తే అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పొచ్చు.