దేవి శ్రీ ప్రసాద్… ఒకప్పుడు రాక్ స్టార్ గా దూసుకుపోయేవాడు. పెద్ద సినిమాలన్నిటికీ దేవి శ్రీ మ్యూజికే ఫస్ట్ ఛాయిస్ అని దర్శకనిర్మాతలు భావించేవారు. అయితే గత రెండేళ్ళుగా అతను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. 2019 లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం నుండీ పెద్ద సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఆకట్టుకోవడం లేదు. మీడియం రేంజ్ సినిమాలకి అతను అందించే మ్యూజిక్ బాగానే ఉంటుంది.
‘చిత్రలహరి’ ‘ఉప్పెన’ ‘రంగ్ దే’ వంటి సినిమాలకి అతను సమకూర్చిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే ‘వినయ విధేయ రామ’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలకి అతను అందించిన మ్యూజిక్ సక్సెస్ కాలేదు. ‘పుష్ప’ కొంతమేర పర్వాలేదు కానీ సూపర్ అనలేము. పాటల విషయంలోనే కాదు నేపధ్య సంగీతం విషయంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ ఆశించిన మేర రాణించడం లేదు.’మహర్షి’ చిత్రానికి అతను అందించిన నేపధ్య సంగీతం చాలా దారుణం అనుకున్నారు జనాలు.
అంతకు మించి వరస్ట్ గా దేవి బి.జి.యం భవిష్యత్తులో ఉండదనుకున్నారు. కానీ అది అతిశయోక్తి మాత్రమే అని ‘పుష్ప’ తో నిరూపించాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా దారుణంగా ఉంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరొందిన దేవి.. ఇలాంటి బి.జి.యం ఇస్తాడని ఎవ్వరూ కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమాతో దేవి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు.. తర్వాత చిరు-బాబీ ల మూవీ అలాగే పవన్- హరీష్ ల మూవీతో పికప్ అయిపోతాడు అని అతని అభిమానులు ఆశించారు. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు.