కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన డెవిల్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో శనివారం రోజున ఈ సినిమాకు బుకింగ్స్ మరీ భారీ స్థాయిలో అయితే లేవు. 20 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.
సలార్ మూవీ విడుదలైన వారానికే థియేటర్లలో విడుదల కావడం డెవిల్ సినిమాపై ప్రభావం చూపిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాకు మాత్రం ఈ వారం కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డెవిల్ మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. ఆరు వారాలకు అటూఇటుగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
డెవిల్ (Devil) మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచితే మంచిదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాల గురించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
కళ్యాణ్ రామ్ పారితోషికం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న దేవర ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.