Dhanush, Prabhas, Ram Charan: క్రేజ్ పెరిగింది కదా అని అది మర్చిపోవద్దు అంటున్న ధనుష్?

తమిళంలో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో ధనుష్ ఒకరు. రజినీ కాంత్, కమల్ హాసన్ లను కలిపితే ధనుష్ అని అక్కడి ప్రేక్షకులు అంటుంటారు. ఇతను ఆల్రెడీ హాలీవుడ్‌ సినిమాలో నటించి గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ‘ది ఎక్స్‌ట్రాడ్నరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. త్వరలోనే ‘ది గ్రే మ్యాన్‌’ అనే మరో ఇంగ్లీష్‌ మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

జోయ్‌ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కెప్టెన్ అమెరికా ఫేమ్‌ క్రిస్‌ ఇవాన్స్‌ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. జులై 22న ఈ చిత్రం విడుదల కానుంది.ఇక ఈ చిత్రం ప్రీమియర్‌ను అమెరికాలో ప్రదర్శించారు. దానిని వీక్షించేందుకు ధనుష్‌ కూడా వెళ్ళాడు. అయితే ప్రీమియర్ చూసిన తర్వాత ధనుష్ బాగా డిజప్పాయింట్ అయ్యాడట. ‘ది గ్రే మెన్’ లో తన పాత్రని బాగా తగ్గించారు అని, పైగా సినిమాలో అయితే దానికి ప్రాధాన్యత కూడా తక్కువగా ఉండటం వల్ల ధనుష్ హర్ట్ అయినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో అతను ప్రభాస్‌, రామ్‌ చరణ్‌లను హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో ప్రభాస్, ధనుష్ లకు హాలీవుడ్లో కూడా క్రేజ్ పెరిగింది. వారితో సినిమాలు చేయడానికి అక్కడి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యనే ఓ హాలీవుడ్ రైటర్ రాంచరణ్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇలాంటివి గమనించిన ధనుష్.. తన అనుభవాన్ని ప్రభాస్, చరణ్ లకు తెలిసేలా చెప్పినట్లు సమాచారం.

క్రేజ్ పెరిగింది కదా అని ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించొద్దు అని అందువల్ల తమ ఇమేజ్ దెబ్బ తింటుంది అని ధనుష్ ఈ సందర్భంగా చెప్పాడట. అంతేకాదు తమకి హాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది సొంత భాషల్లో చేసిన సినిమాలతోనే అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని ధనుష్ గుర్తుచేశాడట.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus