Sir Movie: కలిసొచ్చిన సీజన్ కే ‘సార్’ ను తీసుకురాబోతున్న ‘సితార’ వారు

ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ల పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్యతో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సంస్థ కూడా ‘సార్’ కు సమర్పకులుగా వ్యవహరిస్తోంది. ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారు.

ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ తమిళంలో ‌’వాతి’ గా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. నిజానికి 2022 లోనే ఈ మూవీ రిలీజ్ అవుతుంది అంటూ ప్రకటించారు. కానీ తర్వాత పోస్ట్ పోన్ అయ్యింది. ఫైనల్ గా ‘సార్’ కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. 2023 వ సంవత్సరం ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓ పోస్టర్ ను విడుదల చేసి ఈ విషయాన్ని తెలిపింది ‘సార్’ బృందం.

నిజానికి అది అన్ సీజన్ అయినప్పటికీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందిన ‘భీష్మ’ ‘డీజే టిల్లు’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి.ఆ సెంటిమెంట్ తో ‘సార్’ ను కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది.

ఇక ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ గా ధనుష్ కనిపించబోతున్నారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అవ్వడం దానికి సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది.జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా .. ‘మాస్టారు మాస్టారు’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆ సాంగ్ యూట్యూబ్ లో 9వ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus