ధృవ ట్రైలర్ ఎలా ఉంది అంటే!!!
- November 26, 2016 / 07:21 AM ISTByFilmy Focus
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఆతరువాత రెండో సినిమాకే మగధీరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి, మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్‌చరణ్ తేజ. అయితే కరియర్ తొలి రోజుల్లో వరుస హిట్స్ తో దూసుకుపోయిన చెర్రీ, ఆతరువాత మెల్లగా డిజాస్టర్స్ బాట పట్టాడు…అయితే గత రెండు ఏళ్లుగా చెర్రీ అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాడు…ఇదే క్రమంలో అభిమానులను ఖుషీ చేసేందుకు తమిళ రీమేక్ తని ఒరువన్ తో మన ముందుకు వస్తున్నాడు చెర్రీ…అయితే నిన్ననే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అభిమానులు బ్రహ్మరధం పడుతుంటే….సగటు ప్రేక్షకులు మాత్రం మంచి ట్రైలర్ అంటూ ప్రశంసలు కురిపిస్తూనే చెర్రీ ఈ సినిమాను ఎంచుకున్నందుకు మెచ్చుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో డైలాగ్స్ సైతం సూపర్ గా ఉండడంతో ఈ సినిమా హిట్ ఖాయంగా కనిపిస్తుంది…ఇక స్టోరీ లైన్ లోకి వెళితే…ఐపీయస్ ట్రైనింగ్ పూర్తికాక ముందే డ్యూటీ స్టార్ట్ చేసిన ఓ కుర్రాడు…. సీక్రెట్‌గా శత్రువుకి చుక్కలు చూపిస్తాడు. తనకు చెక్ పెడుతున్నది ఎవరో శత్రువుకి తెలియడంతో ఆ కుర్రాడితో మైండ్ గేమ్ ఆడాలనుకుంటాడు. అప్పుడు ట్రైనీ ఐపీయస్ ఏం చేశాడు? రివర్స్‌లో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు? అనే కథతో తెరకెక్కుతోన్న సినిమా ‘ధృవ. అయితే ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…ఈ సినిమాలో చెర్రీ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడని తెలుస్తుంది…ఇంకేమి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవడాానికి రెడీ అవ్వండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















